- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ రూ.4 వేల కోట్ల బాకీ!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై శీతకన్ను వేసింది. విద్యార్థుల జీవితాలు ఏమైనా తమకేం పట్టదన్నట్లు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది. విద్యార్థులకు రెండేళ్లుగా అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ను ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. దాదాపు రూ.4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించడంలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు తీసుకోవాలంటే మొత్తం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యాలు చెబుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కళాశాలలు నిర్వహించడం కూడా కష్టమని యాజమాన్యాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం అందించడంలేదు. కొవిడ్పేరిట ఈ స్కీమ్కు ఎగనామం పెడుతోంది. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థి సంఘాలు సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేల కోట్లు పెట్టి విలాసవంతమైన సచివాలయం కడుతున్న ముఖ్యమంత్రికి విద్యార్థులకు చెల్లించే స్కాలర్ షిప్పులకు డబ్బులు లేవనడంపై మండిపడుతున్నాయి. హుజురాబాద్ఉప ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్ స్టూడెంట్లకు ఉపకార వేతనాలు అందించడంలో విఫలం కావడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బోధనా రుసుం విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద విద్యార్థికి ఉన్నత చదువులు అందించే లక్ష్యంగా ఫీజు రీయింబర్స్మెంట్పథకాన్ని ప్రశేశపెట్టారు. కానీ నేడు ఈ స్కీమ్ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఈ స్కీమ్మసకబారుతోంది. కొవిడ్తో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్స్ షిప్ ను సైతం రెండేళ్లుగా పెండింగ్‌లోనే పెట్టింది. దీంతో విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్నా ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదనే నెపంతో సర్టిఫికెట్లను తమ వద్దనే పెట్టుకుంటున్నాయి. ఫీజు చెల్లించే సర్టిఫికెట్లు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి. దీంతో నిరుపేదలు ఫీజులు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు చెల్లించే స్తోమత లేక ప్రభుత్వం అందించక మానసిక క్షోభకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురవుతున్నారు. సర్కార్ ఇచ్చే బోధనా రుసుం అందకపోవడంతో ప్రైవేట్యాజమాన్యాలు విద్యార్థుల ముక్కు పిండి మరి పాత బకాయిలను వసూలు చేసుకుంటున్నాయి. విద్యార్థులు ఇతర కోర్సుల్లో చేరాలంటే సర్టిఫికెట్తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు అప్పు తెచ్చి మరీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో 2019-20, 2020-21 విద్యా సంవత్సరానికి గాను కాలేజీలకు సర్కార్ దాదాపు రూ.4 వేల కోట్లు బకాయిలు పడింది. ఇంటర్మీడియట్చదివే విద్యార్థుల నుంచి మొదలుకొని దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. యాజమాన్యాలకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1500 కోట్ల నిధులకు టోకెన్లు జారీచేసినా కొవిడ్సాకుతో మరింత ఆలస్యం చేస్తోంది. ఈ నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారం మోయలేక విద్యాసంస్థలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.
ప్రభుత్వం వేసే భిక్ష కాదు.. ఇది హక్కు
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ లు విద్యార్థుల హక్కు. ప్రభుత్వం వేసే భిక్ష కాదు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో ఇప్పటికే ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యారు. హుజురాబాద్కోసం వేల కోట్లు వెచ్చించిన సర్కార్.. ఫీజు రీయింబర్స్ మెంట్‌కు సాకులు చెప్పడం సిగ్గుచేటు.
-జీవన్, ఏబీవీపీ స్టేట్జాయింట్ సెక్రటరీ
విద్యకు దూరం చేయొద్దు..
నిరుపేద విద్యార్థులు ఇప్పటికే చదువుకు దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు ఇవ్వకుండా మరికొంత మందిని విద్యకు దూరం చేయొద్దు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానసిక క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వం రూ.4 వేల కోట్లు విడుదల చేయాలి.
-అనిల్, విద్యార్థి, సికింద్రాబాద్