రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ నిలిపివేత.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

by Anukaran |   ( Updated:2020-12-19 00:41:12.0  )
రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ నిలిపివేత.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్ : వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌లను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేసుకునే సదుపాయం ఉండగా.., హైకోర్ట్ తీర్పు కారణంగా స్లాట్ బుకింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు రోజుల క్రితం రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో ఆధార్ డేటాను తీసుకోవడం పై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ పలువురు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్ట్.. ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి.., ఇప్పుడు కులం, ఆధార్ కార్డ్ తో పాటు వ్యక్తిగత వివరాల్ని ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వానికి తెలివి ఎక్కువైంది. మాకు ఒకటి చెప్పి, మీరు మరొకటి చేస్తారా అంటూ మండిపడింది. అంతేకాదు కోర్ట్‌కు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయకపోతే కోర్ట్ ధిక్కార చర్యలు తప్పవంటూ హైకోర్ట్.., ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీనిపై పూర్తి వివరాలతో సీఎస్ అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.

అప్పటి వరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ లను నిలిపివేసేందు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

Advertisement

Next Story