- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు, కేసీఆర్‌కు మధ్య నాట్ ఫైటింగ్, నాట్ ఫేవరింగ్ : గవర్నర్
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి తనకి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని జరుగుతున్న ప్రచారం పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవి విశ్రాంతి కోసం కాదు. నాకు సీఎం మధ్య సంబంధం నాట్ ఫైటింగ్ నాట్ ఫేవరింగ్ గవర్నర్ , సీఎం ఆఫీసులు ప్రజల కోసమే పనిచేయాలి. ప్రభుత్వానికి నాకు కాంట్రవర్సీలు ఉంటాయని అనుకున్నారు. మంచి కమ్యూనికేషన్ ఉంటే కాంట్రవర్సీకి ఛాన్సేలేదు. నెలలో వీసీలను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై కామెంట్ చేయను. గవర్నర్ గా నేను రాజకీయాలు మాట్లాడటం సరికాదు’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.
వీసీల నియమాకంపై స్పందించిన గవర్నర్
ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో వీసీల నియామకంపై స్పందించారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో ఉన్న పది యూనివర్సిటీల్లో ఏడాదిన్నరగా పూర్తిస్థాయి వీసీలు లేకపోవడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇన్‌చార్జి వీసీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. గతేడాది మే నెలలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన గవర్నర్ ఫుల్‌టైమ్ వీసీల నియామకం విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరగా వీసీలను నియమించాలని డిసెంబరులోనే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. వెంటనే సీఎం కేసీఆర్ ఉన్నత విద్యామండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొత్త వీసీల నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు.
అయితే తాజాగా మరోసారి గవర్నర్ వీసీల నియామకంపై స్పందించారు. నెలరోజుల్లో వీసీలను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాల్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గుర్తు చేశారు.