- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఏమైనా ఉంటే ఫోన్‌లో చూసుకోండి’
దిశ, కరీంనగర్: కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రముఖులు ఎవరైనా సరే ప్రజా సమూహంలోకి వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా కార్యాలయాలకు, క్యాంప్ ఆఫీసులకు మాత్రమే పరిమితం కావాలని చెప్పినట్టు తెలిసింది. ప్రజల్లో ఉంటూ కార్యకలాపాలకు కొనసాగించడం సరికాదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నందున వ్యక్తిగతంగా కలవడం కానీ, ప్రజల మధ్యకు వెల్లడం కానీ చేయవద్దన్న ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రముఖులు ఇక నుండి పనులన్ని కూడా ఫోన్ల ద్వారానే చక్కబెట్టాలన్న సూచనలందినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వారి వద్ద పనిచేసే అధికారులు కూడా కరోనా బాధితులుగా మారిపోవడంతో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సర్కార్ స్పష్టం చేసింది.