- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొప్పలు పలికిన సర్కారు.. ఆ ప్రాజెక్టు పనులు ఇంకెప్పుడు..?
దిశ ప్రతినిధి, మేడ్చల్: కేశవాపూర్ ప్రాజెక్ట్ నిర్మించి మహానగర ప్రజలకు తాగునీటి గోస తీరుస్తామని రాష్ట్ర సర్కారు గొప్పలు పలికింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అప్పుడే పనులు చేపట్టినంత హంగామా చేసింది. ఓట్లు దండుకోవాలనే ప్లాన్ చేసింది. బల్దియా ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్నా.. నేటీకి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఏమాత్రం ముందుకు సాగడంలేదు. భూసేకరణ పేరిట కేశవాపూర్ ప్రాజెక్ట్‌ను అటకెక్కించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం నాన్చివేతే నయం అన్నట్లు వ్యవహరిస్తుంది.
రూ. 4500 కోట్ల అంచనా వ్యయంతో..
హైదారాబాద్ మహానగరంలో రోజు రోజుకూ జనాభా పెరుగుతుండడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేశవాపూర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టింది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ కొండల నడుమ భారీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనుకుంది. 2050 నాటికి నగరానికి నీటి సమస్య తలెత్తకూడదని 20 టీఎంసీల సామర్థ్యంతో ముందుగా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని డిజైన్ చేశారు. అయితే భూసేకరణలో చిక్కులు రావడంతో 5.4 టీఎంసీల సామర్థ్యానికి తగ్గించారు.
రూ. 4500 కోట్ల వ్యయంతో 1500 ఎకరాల్లో రిజర్వాయర్‌ను నిర్మించాలని రీడిజైన్ చేశారు. ఇందుకోసం అటవీ భూములతో పాటు పట్టాదారుల నుంచి భూమిని సేకరిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కోసం 99 ఎకరాల పట్టా భూములుసేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 50 ఎకరాల వరకు సేకరించారు. ఎకరానికి రూ.35 లక్షల నుంచి రూ.36 లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.20 కోట్ల వరకు చెల్లించారు. అదేవిధంగా 267 ఎకరాల అసైయిన్డ్ భూములుగా ఉన్నాయి. ప్రభుత్వం గతంలో ఈ భూములను లావణి పట్టాలుగా ఇచ్చారు. మళ్లీ తీసుకునే క్రమంలో రైతులకు ఎంత పరిహారం చెల్లించాలనే లెక్కల్లో అధికారులు బీజీగా ఉన్నారు.
కేశవాపూర్ భారీ స్టోరేజీ రిజర్వాయిర్ ప్రత్యేకతలివే..
-రిజర్వాయిర్ నిర్మాణానికి అవసరమయ్యే భూమి :1500 ఎకరాలు
-మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం: రూ.4500 కోట్లు
-రిజర్వాయర్ సామర్ధ్యం :5.4 టీఎంసీలు (గోదావరి జలాలు)
-ఫుల్ రిజర్వాయిర్ లెవల్ : 596 మీటర్లు
-ఎల్ డబ్ల్యు ఎల్ ఎల్ (లోడ్ వాటర్ లైన్ లెన్త్): 540 మీటర్లు
-నీటి వనరు: కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్
-రా వాటర్ తరలించడం: కొండ పోచమ్మ సాగర్ నుంచి 18 కిలో మీటర్ల మార్గంలో భూమ్యాకర్షణ శక్తి ద్వారా భారీ పైపులైన్ల ద్వారా కేశవాపూర్ రిజర్వాయర్‌కు తరలింపు
-మొత్తం పైపులైన్లు :2 వరుసలు
-పైపులైన్ సామర్థ్యం: 3600 ఎంఎం డయా వ్యాసార్థం
-నీటి శుద్ధి కేంద్రం: బొమ్మరాసి పేట వద్ద 172 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసేందుకు వీలుగా నిర్మాణం
-రా వాటర్ తరలింపులకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం :16 మెగావాట్ల సామర్థ్యం గల 4పంపులు
-శుద్ధి చేసిన నీటి తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం :2 మెగా వాట్ల సామర్థ్యం గల 8 పంపులు
-సీ డబ్ల్యూ ఆర్( క్రాప్ వాటర్ రిక్వైర్‌మెంట్ ): 80 మిలియన్ లీటర్లు