- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థర్డ్ వేవ్‌కు రెడీ అవుతున్న ప్రభుత్వం.. వైద్య శాఖలో మళ్లీ పోస్టులు
దిశ, తెలంగాణ బ్యూరో: థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం బీఆర్‌కే భవన్‌లో వైద్యారోగ్యశాఖ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. థర్డ్ వేవ్ ప్రారంభమవుతే యుద్ద ప్రాతిపదికన చికిత్సలు అందించేందుకు తగిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఇటీవల 1,604 మంది కాంట్రాక్ట్ నర్సులను విధుల నుంచి తొలగించడంతో ఆసుపత్రుల్లో చాలా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయనే అంశాలను సమావేశంలో చర్చించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అధిగమించేందుకు వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికపై ఉద్యోగాలను భర్తీ చేయాలనే అంశాలను త్వరలోనే నిర్ణయించనున్నారు. వీటితో పాటు ఆసుపత్రుల్లో సరిపడ మందులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. వ్యాధి నిర్ధారణలు చేపట్టేందుకు కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్‌మెంట్, బయోమెడికల్ పరికరాలు, టెస్టింగ్ కిట్లను ఆసుపత్రులకు సప్లయి చేయనున్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ కొరత తలెత్తకుండా కావాల్సినంత ఆక్సిజన్ నిల్వలను ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను తగినన్ని ఏర్పాటు చేసి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అదనపు నిల్వ సామర్థ్యాన్ని పెంచనున్నారు. అన్ని బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని నిర్ణయించారు. థర్డ్ వేవ్ పిల్లలకు ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలుండడంతో పిడియాట్రిక్ ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌ల సంఖ్యను కూడా గణనీయంగా పెంచేందుకు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఆసుపత్రుల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి అప్ గ్రేడ్ చేయనున్నారు.
- Tags
- COVID-19