- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఉద్యోగులకు TS సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు
దిశ, తెలంగాణ బ్యూరో: పోలీస్ శాఖలో పని చేస్తున్న హోం గార్డులకు గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 శాతం పీఆర్సీని హోం గార్డులకు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవంగా ఈ ఏడాది జూన్‌లోనే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రెగ్యూలర్ ఉద్యోగులకు మాత్రమే 30 శాతంతో పెరిగిన వేతనాలు చెల్లిస్తున్నారు. మిగిలిన వారికి వేతనాల పెంపును అమలు చేయడం లేదు. ఒక్కో శాఖ వారీగా వేతనాలు పెంచుతూ ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నెల మొదటివారంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు హోంగార్డుల వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరికి జూన్ నుంచే వేతన పెంపును వర్తింపచేస్తున్నట్లు పేర్కొంది. జూన్ నుంచి పెంచిన వేతనాలను త్వరలోనే ఏరియర్స్ రూపంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది