మీరు చేసింది చాలు ఇక ఆపండి!

by Anukaran |   ( Updated:2020-07-05 00:37:47.0  )
మీరు చేసింది చాలు ఇక ఆపండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ల్యాబ్‌ల తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా టెస్టింగ్ చేస్తున్న శ్యాంపిల్స్‌లో 71 శాతానికి పైగా పాజిటివ్ రిపోర్టులు రావడం ఏంటని సర్కార్‌ ప్రశ్నించింది. ప్రభుత్వ పోర్టల్‌లో కూడా సరిగ్గా డాటాను అప్‌లోడ్ చేయడం లేదని ప్రైవేట్ ల్యాబులపై మండిపడింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాబుల్లో కరోనా పరీక్షలను నిలిపివేస్తూ తెలంగాణ వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆయా ల్యాబ్స్‌లో చేసిన శ్యాంపిల్స్‌ను సర్కార్‌ ల్యాబ్‌లో వ్యాలిడేటేషన్‌కు తీసుకోనున్నారు. ఎక్స్ పర్ట్ కమిటి సైతం ల్యాబుల్లో పరిస్థితులను పరిశీలించనున్నారు. సరైన ప్రామాణిక పద్ధతిలో కరోనా టెస్టులు చేయకపోవడంతో.. ప్రైవేట్ ల్యాబులు తప్పులను వెంటనే సరిదిద్దుకోకపోతే ల్యాబ్ లను మూసివేస్తామని సర్కారు హెచ్చరించింది. అంతే కాకుండా, 13 ప్రైవేట్ ల్యాబులకు ప్రభుత్వం నోటీసులు పంపడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed