- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ సెకండియర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్‌లోకి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఏ ప్రతిపాదికన మార్కులు ఇవ్వాలనే విషయానికి సంబంధించిన పూర్తి అధికారాలను ఇంటర్ బోర్డుకు అప్పగించింది.
ఇంటర్ ఫలితాల క్రైటీరియాను త్వరలో అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ క్రమంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. అందరినీ పాస్ చేసింది. ఇంటర్నర్ మార్కుల ఆధారంగా మార్కులు ఇస్తామని గతంలో ప్రకటించింది. ఇటీవల ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా రద్దు వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.