థాయ్‌లాండ్ వెళ్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్

by John Kora |
థాయ్‌లాండ్ వెళ్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్
X

- డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

- వెల్లడించిన పీఎం పెతుంగ్టాన్ షినోవత్రా

దిశ, నేషనల్ బ్యూరో:

థాయ్‌లాండ్ దేశంలో ఇకపై క్యాసినోలను చట్టబద్దం చేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు థాయ్ కేబినెట్ సోమవారం డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించినట్లు ప్రధాని పెతుంగ్టాన్ షినోవత్రా మీడియాకు తెలిపారు. దేశంలో టూరిజంకు ఊతమివ్వడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పడేయడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఆమె తెలిపారు. థాయ్‌లాండ్‌లో బాక్సింగ్, హార్స్ రేసింగ్ వంటి మీద బెట్టింగ్ చేయడానికి అనుమతి ఉంది. కానీ ఇప్పటి వరకు క్యాసినోలకు చట్టబద్దత లేదు. ఇక ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా వీటికి అనుమతిస్తుండటంతో దేశంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, అక్రమ గ్యాంబ్లింగ్‌కు కూడా తెరపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది తప్పకుండా థాయ్ సమాజానికి లబ్ది చేకూరుస్తుందని పీఎం షినోవత్రా పేర్కొన్నారు. దేశంలో స్థిరమైన పర్యాటకాని ఇది దోహదపడుతుందని ఆమె పార్లమెంటులో చెప్పారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆమె తెలిపారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే 'ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్‌'ల పేరుతో క్యాసినోలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ కాంప్లెక్సుల్లో హోటల్, కన్వెన్షన్ హాల్, మాల్స్, థీమ్ పార్క్‌లతో పాటు క్యాసినోను కూడా నిర్వహించుకోవచ్చు. అయితే 20 ఏళ్లకు పైబడిన వారిని మాత్రమే క్యాసినో లోపలికి అనుమతి ఇస్తారు. విదేశీయులు ఈ క్యాసినోలకు ఉచితంగానే వెళ్లవచ్చు. కానీ థాయ్‌లాండ్ దేశస్థులు మాత్రం 5000 బాత్‌లు (దాదాపు రూ.12,500) చెల్లించాల్సి ఉంది. అయితే ఈ బిల్లును మొదటిగా ఆఫీస్ ఆఫ్ కౌన్సిల్ స్టేట్‌కు రివ్యూ కోసం పంపుతారు. ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి జిరాయు హోన్సబ్ వెల్లడించారు.

Next Story

Most Viewed