- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TPCC: ఆ పేరు వింటే ఉలిక్కి పడుతున్న సైకోరామ్ ముఠా.. సామా రామ్మోహన్ రెడ్డి సెటైర్

దిశ, వెబ్ డెస్క్: మాదక ద్రవ్యాల పేరు వింటే ఉలిక్కి పడుతున్న సైకోరామ్ ముఠా అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్(TPCC Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) సెటైర్(Sataire) వేశారు. ట్విట్టర్ లో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే సామా.. ప్రతిపక్షాల మాటలకు ధీటుగా సమాధానం ఇస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు కౌంటర్ వేస్తుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాలు, గంజాయి, పేకాట లాంటి అసాంఘిక ఘటనల వార్తలు విన్నా ఉలిక్కి పడుతున్న సైకో రామ్ ముఠా.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే ఉలిక్కి పడేది కేవలం దొంగలే కదా? అని ఎద్దేవా చేశారు. ఇక పదేళ్లు యదేచ్ఛగా కొనసాగిన అరాచకాలు ప్రజాపాలనలో ఒక్కసారిగా అడ్డుకట్ట పడుతుండటంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న సైకో రామ్ ముఠా!! అని ఎక్స్ వేదికగా సామా సంచలన వ్యాఖ్యలు చేశారు.