- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెనక్కు తగ్గిన తెలంగాణ సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో : సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుపై సమాధానం ఇవ్వడానికి విధిగా ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనంటూ అక్టోబరులో జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రధాన కార్యదర్శి ఉపసంహరించుకున్నారు. సమాచారాన్ని ఇవ్వడానికి ఇకపైన ఎలాంటి ఆంక్షలు ఉండవని అడ్వొకేట్ జనరల్ క్లారిటీ ఇచ్చారు. సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని బెంచ్ ముందుకు మంగళవారం విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం స్ఫూర్తికి భిన్నంగా జారీ అయిన ఈ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు.
పార్లమెంటు ఆమోదంతో ఉనికిలోకి వచ్చిన చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఓ ఉన్నతాధికారికి ఉండదని, కానీ ఆ స్ఫూర్తికి భిన్నంగా ప్రధాన కార్యదర్శి ఆంక్షలపేరుతో స్ఫూర్తిని నీరుగార్చడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది షీలు రాజు వాదించారు. భద్రతాపరమైన అంశాలతో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం కొన్నింటికి సమాధానం ఇవ్వడానికి మినహాయింపు ఉంటుందిగానీ, ఉన్నతాధికారుల అనుమతి తర్వాత మాత్రమే ఇవ్వాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదని వాదించారు. కేంద్ర చట్టాన్ని బైపాస్ చేసే తీరులో ప్రధాన కార్యదర్శి తన అధికారాలను మరచి ఈ సర్క్యులర్‌ను జారీ చేయడం చెల్లదని వాదించారు.
ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ వాదనలేవీ చేయకుండానే ఆ సర్క్యులర్ జారీ చేయడం వెనక ఉద్దేశాన్ని మాత్రమే వివరించారు. చట్టానికి భిన్నంగా విధించిన ఆంక్షలు చెల్లుబాటు కావనే అభిప్రాయంతో అక్టోబరులో జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
- Tags
- AG
- high court