బ్రేకింగ్ : వచ్చే ఏడాదికి సెలవులు ప్రకటించిన సర్కార్

by Shyam |   ( Updated:2021-11-26 10:23:56.0  )
WhatsApp Image
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై సీఎస్ సోమేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం 2022 సంవత్సరంలో 28 రోజులు సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ 23 రోజులుగా ఉంది. సాధారణ సెలవుల జాబితా ప్రకారం.. జనవరి నెలలో 1,14,15,26, మార్చిలో 1,18 ఏప్రిల్‌లో 2,05,10,14,15, మేలో 3,4, జులైలో 10,25, ఆగస్టులో 9,15,20,31, సెప్టెంబర్‌లో 25, అక్టోబర్‌లో 2,5,6,9,25, నవంబర్‌లో 8, డిసెంబర్ నెలలో 25,26 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుగా నిర్ణయించారు. అయితే, జనవరి 1న సెలవుగా ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరి 12న రెండవ శనివారం వర్కింగ్ డేగా పరిగణించనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా జనవరి 16, ఫిబ్రవరి 5,15, మార్చి 1, 19, ఏప్రిల్ 14,22, 29, మే 3,16, జులై 1,18, ఆగస్టు 5, 8, 12, 16, సెప్టెంబర్ 17, అక్టోబర్ 3, 4,24, నవంబర్ 6, డిసెంబర్ 8, 24 వ తేదీల్లో ఆప్షనల్ హాలిడేస్‌గా ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed