కోవిడ్-19పై తెలంగాణ సర్కార్ అప్రమత్తం

by Shyam |
కోవిడ్-19పై తెలంగాణ సర్కార్ అప్రమత్తం
X

కోవిడ్-19పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే గాంధీలో 39 మంది, ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అటు ఎయిర్‌పోర్టులో విదేశీయులకు థర్మో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు 19 వేల మందికి థర్మో స్క్రీనింగ్ చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ కరోనాకు వైద్యం అందించనున్నారు. మొత్తం మూడు వేల ఐసోలేషన్ పడకలను అధికారులు సిద్ధం చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు రూ. వంద కోట్లు సర్కార్ విడుదల చేసింది.

Tags: alert, covid-19, telangana government

Advertisement

Next Story

Most Viewed