- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామంతాపూర్‌లో తాబేళ్ల స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అటవీ నిఘా విభాగం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శనివారం అరెస్ట్ చేశారు. నిందితులైన ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన శివ బాలక్, రాహుల్ కష్యప్‌లను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నారు. లక్నో సమీపంలో ఉన్న గోమతి నదిలో తాబేళ్లని పట్టి రైళ్ల ద్వారా హైదరాబాద్‌కి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో వీరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ పోలీసుల ద్వారా కొనసాగుతుందని విజిలెన్స్ అధికారి రాజా రమణా రెడ్డి తెలిపారు. ఒక్కో తాబేళును రూ. వెయ్యి వరకూ అమ్ముతున్నారన్నారు. వీటిని కొనుగోలు చేస్తున్న పెట్ షాప్స్ నిర్వాహకులను అధికారులు హెచ్చరించినట్లు తెలిపారు. తాబేళ్లను తరలించి అమ్ముతున్న విధానంపై తదుపరి విచారణ కోసం వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి పీసీసీఎఫ్ ఆర్. శోభ లేఖ రాయనున్నట్లు తెలిపారు. ముఠాని పట్టుకున్న వారిలో విజిలెన్స్ పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, రేంజ్ ఆఫీసర్ రమేష్ కుమార్, జీ సీతారాములు, వాహెద్, శ్రీనివాసులు, ఫరీధ్ లు ఉన్నారు.
- Tags
- forest dept