- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: లాక్‌డౌన్‌లో సీజ్ చేసిన వాహనాలు విడుదల
దిశ, వెబ్‌డెస్క్: నిబంధనలకు విరుద్ధంగా లాక్‌డౌన్ బయట తిరిగి వాహనం సీజ్ వాహన దారులందరికీ తెలంగాణ పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. సీజ్ చేసిన వాహనాల్లో జరిమానా చెల్లించిన వాహనాలను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆఫీస్ నుంచి అన్ని పోలీస్ కమిషనరేట్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ–పెట్టీ, ఈ–చలానాల జరిమానాలను చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు వాహనదారులకు సూచనలు చేశారు. తీవ్రమైన వాటికి మాత్రం న్యాయస్థానం గడప తొక్కాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా, కరోనా విజృంభణతో మే నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనలకు పోలీసులు ఎపిడమిక్ యాక్ట్ సెక్షన్ ఐపీసీ 188 కింద కేసులు నమోదు చేశారు. అందులో జరిమానాలను ఈ–చలానా, ఈ–పెట్టీ కేసుల కింద పోలీసులే విధిస్తే.. స్థానిక పోలీస్‌స్టేషన్లో చెల్లించి విడిపించుకోవచ్చు.
చెల్లింపు ఇలా : స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. జరిమానా ఎలా చెల్లించాలో పొందుపరిచారు. టీ–యాప్, టీ–వ్యాలెట్, ఈ సేవ/మీసేవ/పేటీఎం/టీఎస్‌ఆన్‌లైన్ లేదా https://echalan.tspolice.gov.inలో చెల్లించాలి.
కోర్టుకు వెళితే ఇలా : ఈ మొత్తంలో కొన్ని తీవ్రమైన కేసులను పోలీసులు కోర్టుకు పంపుతున్నారు. అలాంటివారు మాత్రం నేరుగా కోర్టుకు వెళ్లి అక్కడ జరిమానా చెల్లించాలి. లేకపోతే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం.. ఆ వ్యక్తిపై పోలీసులు చార్జీషీట్ దాఖలు చేస్తారు. దాని ఆధారంగా కోర్టు అతనికి జైలుశిక్ష ఖరారు చేస్తుంది.
దగ్గుబాటి సురేష్ బాబుకు టోకరా.. కేటీఆర్ ఆఫీస్ నుంచే..
రాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ ఎత్తేసిన విషయం తెలిసిందే. అయితే.. లాక్‌డౌన్ ఎత్తేసినా.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మాస్కు విధిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పునరుద్ఘాటించింది. పాటించనివారిపై కేసులు నమోదు చేసి, రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపింది.