పీహెచ్‌డీ పట్టా పొందిన తెలంగాణ డీజీపీ

by Shyam |
పీహెచ్‌డీ పట్టా పొందిన తెలంగాణ డీజీపీ
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: డీజీపీ మహేందర్‌రెడ్డి పీహెచ్‌డీ పట్టా పొందారు. ‘ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలీసింగ్’ అనే అంశంపై డీజీపీ మహేందర్‌రెడ్డి జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందారు. తన పరిశోధన పూర్తయిన పిదప స్నాతకోత్సవంలో భాగంగా ఇంచార్జ్ వీసీ జయేశ్‌రంజన్ చేతుల మీదుగా డీజీపీ మహేందర్‌రెడ్డి పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌, యూనివర్శిటీ ఛాన్స్‌లర్ ఆన్‌లైన్‌ ద్వారా ఉపన్యాసం చేశారు. అనంత‌రం డీజీపీ మాట్లాడుతూ ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఇనర్మేషన్‌ టెక్నాలజీ ఆన్‌ పోలీసింగ్‌ అనే టాపిక్‌పై పీహెచ్‌డీ అవార్డు పొందడం ఆనందంగా ఉందన్నారు. పీహెచ్‌డీ పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Next Story