‘తెలంగాణ దేవుడు’.. స్టోరీ ఆ నేతదే!

by Shyam |
Telangana Devudu
X

దిశ, సినిమా: శ్రీకాంత్, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహముద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న చిత్రానికి వడత్య హరీష్ దర్శకులు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి వివరాలు వెల్లడించారు డైరెక్టర్. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చిన ఉద్యమ ధీరుడి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ సినిమాతోనే 50 మంది పెద్ద నటీనటులను డైరెక్ట్ చేసే చాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నామని, మార్చి చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నందన్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా.. బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ లాంటి యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed