- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ సాగు విధానం దేశానికే ఆదర్శం
దిశ, నల్లగొండ: రైతుల తలరాతల్ని మార్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గ కేంద్రాల్లో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకాలం నుంచే సీఎం కేసీఆర్ అనుక్షణం రైతుల గురించే ఆలోచించారని పేర్కొన్నారు. స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టి రైతుల తలరాతలు మార్చారని గుర్తు చేశారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభాలు గడించాలని మంత్రి రైతులను కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే ఆదర్శంగా నిలవబోతుందని తెలిపారు. ఈ సదస్సులో శాసన మండలి డిఫ్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీసీ కార్పోరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంచంద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.