- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లె నిద్రలు చేయాలని అధికారులకు సీఎస్ పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో : స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోడానికి, వాటిని పరిష్కరించే మార్గాలు వెదకడానికి జిల్లా అధికారులు పల్లె నిద్రలు చేయాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానికంగా ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్కడ జరుగుతున్న పనులు, వాటి నాణ్యత తదితరాలను అధ్యయనం చేయాలని సూచించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సచివాలయం నుంచి బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సీఎస్ అనేక అంశాలను ప్రస్తావించారు.
స్థానిక సంస్థల నిర్వహణ తీరు మెరుగుపడాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, ధరణి, కరోనా వ్యాక్సినేషన్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పారిశుద్యం, పచ్చదనం పెంపు తదితర అంశాలపై నిత్యం జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని నొక్కిచెప్పారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో రాత్రిపూట బస చేసి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. పారిశుద్యం, పచ్చదనం, గ్రామసభల నిర్వాహణ, ప్రగతి నివేదికల తయారీ సీజనల్ క్యాలండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు.
రిజర్వు ఫారెస్ట్ బ్లాకులలో పెద్ద ఎత్తున మొక్కలను పెంచాలని, జిల్లాలలో అన్ని రహదారుల వెంట మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, పట్టణాలలోని ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటాలని, కొత్తగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయ కాంప్లెక్సులలో పచ్చదనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పల్లెల్లో ప్రకృతి వనాల ఏర్పాటును సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ధరణిలో పెండింగ్ ధరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వెజ్, నాన్-వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు స్ధలాలను అప్పగించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సీఎస్ చర్చించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.