కూలీలకు పని కల్పించాలి : సీఎస్

by Shyam |
కూలీలకు పని కల్పించాలి : సీఎస్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడంతో పాటు కూలీలకు తప్పనిసరిగా పనులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం బీఆర్‌కే భవన్‌లో నీటిపారుదల, పంచాయతీ రాజ్ పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనుసంధానం చేసే విషయాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ నేపథ్యంలో వచ్చే 30 రోజులు కూలీలకు పనులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సకాలంలో డబ్బులు చేతికి అందుతాయని, తద్వారా గ్రామాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. కాలువల నిర్మాణం, ఫీడర్ ఛానల్ పనులు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనులు చేయాలని కోరారు.

Advertisement

Next Story