- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు మద్దతు ధర ఖరారు
దిశ తెలంగాణ బ్యూరో: కేంద్రం విడుదల చేసిన మార్గనిర్దేశకాల ప్రకారం రైతుల నుంచి వరి ధాన్యం సేకరణకు మద్ధతు ధరను నిర్ణయించింది తెలంగాణ పౌరసరఫరాల శాఖ. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్స్ ద్వారా పంపిణీ కేంద్రాలకు అందించనున్నది. ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో 5,690 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. వరి గ్రేట్ ఎ రకానికి క్వింటాల్ రూ. 1,888లుగా, సాధారణ వాటికి క్వింటాల్ రూ.1,868లకు తీసుకోవాలని నిర్ణయించింది. గత ఏడాది 2019-20లో సాగుకు అదనంగా ఈ ఏడు 2020-21లో 30-40 శాతం సాగు పెరుగుతుందని దీంతో 90లక్షల మెట్రిక్ టన్నులు పెరుగుతుందని అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్ కొనుగోలు అక్టోబర్ 1, 2020, రబీ సీజన్ కొనుగోలు ఏప్రిల్ 1, 2021 నుంచి ప్రారంభించడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. వానాకాలంలో మిల్లర్లు సేకరించిన ధాన్యాన్ని అందించేందుకు తుది గడవు 31మార్చి, 2021గానూ రబీసీజన్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఉంటుందని తెలిపింది. వరి ధాన్యం సేకరణ రైస్ మిల్స్ సామర్ధ్యం మేరకు కేటాయింపులు జరుగుతాయని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.