తెలంగాణ బీజేపీ ఆఫీస్ అద్దాలు ధ్వంసం

by Shyam |   ( Updated:2020-09-22 20:35:15.0  )

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. 12 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన కాసేపటికే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా చేపట్టారు. గోల్కొండ- గోషామహల్ ఇన్‌చార్జీగా పాండు యాదవ్‌ను నియమించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇదేక్రమంలో ఆగ్రహానికి గురైన కొంతమంది కార్యకర్తలు పార్టీ ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను నిలువరించారు.

Advertisement

Next Story