మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు

by Shyam |
మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ కార్యాలయం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆమోదిస్తారు. గత సంవత్సరం బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్‌లో జరిగాయి. అనంతరం మున్సిపల్ చట్టాన్ని ఆమోదించడానికి రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన సభ వాయిదాపడింది. 6 నెలల తర్వాత బడ్జెట్ సమావేశాల కోసం అసెంబ్లీ, కౌన్సిల్‌లు మార్చి 6న సమావేశమవుతాయని గవర్నర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.

Advertisement

Next Story