‘పట్టిసీమ’ తాత్కాలికమా.. పర్మినెంటా..?

by srinivas |
‘పట్టిసీమ’ తాత్కాలికమా.. పర్మినెంటా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణం చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ ఎత్తిపోతల్లో భాగం కాదని, ఈ ప్రాజెక్టుతో ప్రతిఏటా 100 టీఎంసీలను తరలించుకుపోతున్నారని తెలంగాణ న్యాయవాది సాక్షి గణశ్యాం ఝా వాదించారు. గోదావరి నీళ్ల మళ్లింపు అంశంపై శుక్రవారం బ్రిజేష్​కుమార్​ట్రిబ్యునల్​ఎదుట వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ తరఫు న్యాయవాది వెంకటరమణిని సైతం ప్రశ్నించారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టులో భాగంగానే తాత్కాలికంగా పట్టిసీమ ఎత్తిపోతలు నిర్మించారని ఏపీ సాక్షి వెల్లడించారు.

దీనిపై తెలంగాణ తరుఫున గణశ్యాం ఝా వాదనలు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలతో ప్రతిఏటా 100 టీఎంసీలు తరలిస్తున్నారని, ఇది తాత్కాలికమైన ప్రాజెక్టు కాదని, పోలవరం పూర్తి చేసినా దీన్ని కొనసాగిస్తారని వివరించారు. పట్టిసీమ ద్వారా ఎక్కువ నీటిని తరలిస్తున్నారని వాదించారు. ఈ ప్రాజెక్టును భారీ వ్యయంతో నిర్మించారని, పోలవరం పూర్తి అయిన తర్వాత పట్టిసీమను నిలిపివేస్తారనేందుకు అవకాశమే లేదన్నారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత మరింత సమాచారంతో రావాలని ఏపీ సాక్షికి సూచించారు. అనంతరం వాదనలను వచ్చేనెలకు వాయిదా వేశారు. విచారణను ఏప్రిల్ 28 నుంచి 30 వరకు నిర్వహిస్తామని ట్రిబ్యునల్​ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed