- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు సీరియస్: సుమోటోగా వామన్‌రావు దంపతుల కేసు
దిశ, వెబ్‌డెస్క్: అడ్వొకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. బుధవారం పెద్దపల్లిలో జరిగిన లాయర్ దంపతుల హత్యపై ధర్మాసనం స్పందించింది. ఈ హత్యను సుమోటోగా పరిగణిస్తామని పేర్కొంది. న్యాయవాదుల హత్యపై నివేదిక సమర్పించాలని గురువారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితి లోగా విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని న్యాయస్థానం సూచించింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని తెలిపింది. ఈ హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 1వ తేదికి వాయిదా వేసింది.
వామన్‌రావు దంపతుల హత్యపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ హత్యపై సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై నేడు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.