జాతీయస్థాయిలో రాణించిన తేజ.. ఆ మంత్రి పీఆర్వో అభినందనలు

by Shyam |
జాతీయస్థాయిలో రాణించిన తేజ.. ఆ మంత్రి పీఆర్వో అభినందనలు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: జాతీయ స్థాయి క‌రాటే పోటీలో గోల్డ్ మెడ‌ల్ సాధించిన యువ‌ క్రీడాకారుడు తేజ‌ను ర‌వాణా శాఖ మంత్రి పీఆర్వో వార‌ణాసి సుధాక‌ర్ చారి అభినందించారు . పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ గురు గావ్ ఇండోర్ స్టేడియంలో ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో జ‌రిగిన జాతీయ స్థాయి క‌రాటే చాంపియ‌న్‌ఫిప్ పోటీలో తేజ బంగారు ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నారు. అండ‌ర్ 17లో టైటిల్‌ను ద‌క్కించుకుని అమృత్‌స‌ర్ నుంచి తిరిగి వ‌చ్చిన తేజ‌ను, టైగర్ బ్రూస్ లీ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమీ కోచ్ శివ‌యాద‌వ్‌ను వారణాసి సుధాకర్ చారి క‌లుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. సామాన్య కుటుంబం నుంచి జీవ‌న ప్రస్థానం కొన‌సాగిస్తూ క్రీడా రంగంలో త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను చాటుకోవ‌డానికి ప్రయ‌త్నిస్తున్న తేజ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడ‌ల్ సాధించ‌డం ఎంతో గొప్ప విష‌య‌మ‌ని వారణాసి సుధాకర్ చారి కొనియాడారు. క్రీడ‌ల్లో పైకి ఎద‌గాల‌నే త‌ప‌నతో స‌మ‌యానుకూలంగా వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటే ల‌క్ష్యాన్ని అధిగ‌మించ‌డం క‌ష్టత‌రం కాద‌న్నారు. జీవితాన్ని చ‌క్కగా మ‌లుచుకుని ఉన్నత స్థితికి, స్థాయికి ఎద‌గాల‌ని, తేజ‌కు ఉజ్వల భ‌విష్యత్తు ఉండాల‌ని తాను ఆకాంక్షిస్తున్నట్లు సుధాక‌ర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story