విముక్తి కోసం.. తెలంగాణలో ‘తీన్మార్’ యుద్ధం

by Anukaran |   ( Updated:2021-07-09 02:10:58.0  )
విముక్తి కోసం.. తెలంగాణలో ‘తీన్మార్’ యుద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో : సర్కారుపై సమరానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రమంతటా పర్యటించడానికి తీన్మార్ మల్లన్న నడుం బిగిస్తున్నారు. ఇందుకోసం ఒక సైన్యమే తయారవుతున్నది. మొత్తం 33 జిల్లాల్లో సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. వారం రోజుల్లో మండలస్థాయి కమిటీలు కూడా ఏర్పాటు కానున్నాయి. ప్రతీ సమన్వయ కమిటీలో ఒక కన్వీనర్, ఒక కో-కన్వీనర్‌లకు అదనంగా పది మంది చొప్పున సభ్యులుంటారు. వీరి నియామక ప్రక్రియ పూర్తయింది. ఈ కమిటీలన్నింటినీ సమనన్వయం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో సైతం ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రస్థాయి కమిటీకి దాసరి భూమయ్య కన్వీనర్‌గా, మాదం రజనీకుమార్ కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు.

ఆగస్టు నెల నుంచి అన్ని జిల్లాలను కవర్ చేస్తూ సుమారు ఆరు వేల కి.మీ. మేర పాదయాత్రకు తీన్మార్ మల్లన్న శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారం కోసం ఎదురుచూపులు, ప్రభుత్వ వైఫల్యం, వ్యవస్థలో లోపాలు తదితరాలే ప్రధాన ఎజెండాగా చేపట్టనున్న ఈ పాదయాత్ర జిల్లాల్లోని స్థానిక సమస్యలను కూడా ఎత్తిచూపనుంది. మండల స్థాయిలో సైతం అడ్‌హక్ కమిటీలు ఏర్పడిన తర్వాత ఈ నెల 18వ తేదీన ఘటకేసర్ సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు.

తెలంగాణ తల్లిని విముక్తి చేస్తాం : తీన్మార్ మల్లన్న

“దొరల గడీలలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేసేందుకే ‘తీన్మార్ మల్లన్న సైన్యం‘ తయారైంది. అన్ని జిల్లాల్లో మా సైనికులు ఇక సమరం మొదలుపెట్టనున్నారు. యుద్ధం మొదలైంది. ప్రజలకు విముక్తి కల్పిస్తాం” అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. నగర శివారులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ‘తీన్మార్ మల్లన్న టీమ్‘ ముఖ్య నాయకుల సమావేశం సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్త పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 6000 కి.మీ. మేర ఈ పాదయాత్ర జరుగుతుందన్నారు. పాదయాత్ర సమన్వయం కోసం రాష్ట్ర, జిల్లా అడహక్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని 33 జిల్లాలకూ కన్వీనర్, కో-కన్వీనర్లను నియమించామని, వీరితో పాటు ప్రతీ కమిటీలో పదిమంది సభ్యులు కూడా ఉంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీకి దాసరి భూమయ్య కన్వీనర్‌గా, కో-కన్వీనర్‌గా మాదం రజినికుమార్, మరో పదిమంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ఈ వేదికగా ప్రకటించారు. ఈ నెల 17వ తేదీలోగా మండల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18న ఘట్కేసర్‌లో సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభలోనే ‘తీన్మార్ మల్లన్న టీమ్‘ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. టీమ్ మొదటి సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నాగయ్య, చందు, శ్రీకాంత్ రెడ్డి, మాంచాల గూడూరు, ఈశ్వరీ, మధు తదితరులు పాల్గొన్నారు.

1. కరీంనగర్ జిల్లా కన్వీనర్ యు విశ్వం, కో కన్వీనర్ ఆర్ కరుణాకర్
2. పెద్దపల్లి జిల్లా కన్వీనర్ డాక్టర్ వివేక్ పటేల్, కో కన్వీనర్ ఎస్.అనిల్
3. జగిత్యాల జిల్లా కన్వీనర్ పురుషోత్తం, కో కన్వీనర్ ఎన్ మల్లేశం,
4. సిరిసిల్ల జిల్లా కన్వీనర్ దేవరాజ్,
కో కన్వీనర్ ఎండి ఫరీద్,
5. మహబూబ్ నగర్ కన్వీనర్ కే హరినాయక్ కోకన్వీనర్ కె కృష్ణయ్య,
6. నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ జి సతీష్, కో కన్వీనర్ పి రాణి,
7. వనపర్తి జిల్లా కన్వీనర్ ఎస్ రవికుమార్, కో కన్వీనర్ విజయ్ యాదవ్
8. గద్వాల్ జిల్లా కన్వీనర్ ఎండి మాజ్, కో కన్వీనర్ కె వెంకటేష్
9. నారాయణపేట జిల్లా కన్వీనర్ శివారెడ్డి, కో కన్వీనర్ సమ్రీన్,
10. వరంగల్ అర్బన్ జిల్లా కన్వీనర్ యు విజయ్ కుమార్, కో కన్వీనర్ రమణకుమార్ పటేల్.
11. వరంగల్ రూరల్ జిల్లా కన్వీనర్ కె మణికంఠ, కో కన్వీనర్ బి ప్రణయ్ కాంత్
12. భూపాలపల్లి జిల్లా కన్వీనర్ జంపన్న, కో కన్వీనర్ శేఖర్ నాని
13. ములుగు జిల్లా కన్వీనర్ ఎం భద్రయ్య, కో కన్వీనర్ కిషన్.
14. మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ జి రామకృష్ణ, కో కన్వీనర్ వేణు,
15. జనగామ జిల్లా కన్వీనర్ పి రఘు, కో కన్వీనర్ డి శ్రీను.
16. ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ వనిత, కో-కన్వీనర్ బీ హిమన్ష్ శర్మ.
17. ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ డి మారుతి, కో-కన్వీనర్ శౌర్య కుమార్
18. నిర్మల్ జిల్లా కన్వీనర్ వెంకట మహేంద్ర, కో కన్వీనర్ ఎస్ మోహన్ దాస్
19. మంచిర్యాల జిల్లా కన్వీనర్ డి రఘునాథ్, కో కన్వీనర్ పి రణదీప్.
20. నిజామాబాద్ జిల్లా కన్వీనర్ డి ఎల్ ఎన్ చారి, కోకన్వీనర్ జి శ్రీనివాస్,
21. కామారెడ్డి జిల్లా కన్వీనర్ కె సత్యం సిద్ధార్థ్, కో కన్వీనర్ డి వినోద్ రెడ్డి.
22. రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కె కృష్ణ, కో కన్వీనర్ బి నరేందర్ గౌడ్,
23. వికారాబాద్ జిల్లా కన్వీనర్ కె అర్జున్ రెడ్డి, కోకన్వీనర్ అమీన్
24. మెదక్ జిల్లా కన్వీనర్ లక్ష్మణ్, కోకన్వీనర్ పూర్ణ చందర్.
25. సిద్దిపేట జిల్లా కన్వీనర్ జి మహేష్, కో కన్వీనర్ ఎం శ్రీనివాస్,
26. సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఏ కిషోర్, కో కన్వీనర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి.
27. హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఎం.చంద్రశేఖర్, కో కన్వీనర్ సాయి కృష్ణ రెడ్డి,
28. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ జి మహేందర్ గౌడ్, కో కన్వీనర్ కె మహేష్,
29. ఖమ్మం జిల్లా కన్వీనర్ జి రమేష్, కో కన్వీనర్ వి అనిరుద్,
30. కొత్తగూడెం కన్వీనర్ పి రాజీవ్ కుమార్, కో కన్వీనర్ జి అనిల్ కుమార్,
31. నల్లగొండ జిల్లా కన్వీనర్ పి ధనుంజయ్, కో కన్వీనర్ వై శేఖర్,
32. సూర్యాపేట జిల్లా కన్వీనర్ కే శ్రీను, కో కన్వీనర్ శ్రీను నాయక్,
33. భువనగిరి జిల్లా కన్వీనర్ బి సునీత, కో కన్వీనర్ ఎల్ విజయ్ కుమార్

Advertisement

Next Story