- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరోసారి చంచల్ గూడ జైలుకు తీన్మార్ మల్లన్న..
దిశ, డైనమిక్ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. గత నెలలో జ్యోతిష్యుడు లక్ష్మీ కాంత శర్మను బ్లాక్ మెయిల్ చేశారనే కేసులో పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల పాటు చంచల్ గూడ జైలులో రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిమాండ్ పూర్తయినందున బెయిల్ పై గురువారం బయటకొచ్చి ఇంటికి చేరుకున్నారు.
కాగా, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు తనని డబ్బులివ్వాలని బెదిరించారని నిజామాబాద్ జిల్లా, ఎడపల్లికి చెందిన కల్లు వ్యాపారి జయవర్ధన్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్ తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఉప్పు సంతోష్, రాజాగౌడ్, సాయాగౌడ్, రాధాకిషన్‌ను ఇటీవలే అరెస్టు చేశారు. కాగా, మల్లన్న ఇంటికి చేరకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్న కొంత సమయానికే అరెస్టు చేసి నిజమాబాద్ కి తరలించారు. మలన్నను రిమాండ్ చేస్తూ మరోసారి చంచల్‌గూడ జైలుకి తరలించారు.