- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సేవ్ ఆర్కిటిక్’.. 18 ఏళ్ల రోస్ నిరసన!
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధృవాల్లో మంచు కరిగి, క్రమక్రమంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్నేళ్లలో ఆర్కిటిక్ మహా సముద్రం మంచు రహితంగా తయారవుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఆర్కిటిక్ మహాసముద్రం ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. అయితే, దశాబ్దాలుగా పెరుగుతున్న భూతాపం వల్ల ఆర్కిటిక్‌లో ఉన్న మంచు వేగంగా కరిగిపోతుండటంతో.. ఎన్నో జీవులకు ఆవాసమైన ఆర్కిటిక్‌లో జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆర్కిటక్ మహాసముద్రాన్ని కాపాడాలంటూ.. ఓ 18 ఏళ్ల అమ్మాయి మ్యా రోస్ నిరసన చేపట్టింది.
‘యూత్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్’ అనే ప్లకార్డు చేత పట్టుకుని, బ్రిటీష్ యాక్టివిస్ట్ రోస్.. ఆర్కిటిక్ మహాసముద్రం అంచున మంచులో నిలబడి నిరసనకు దిగింది. ‘నా తరం వాళ్లంతా.. క్లైమేటే చేంజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. మనం పెద్దయ్యే వరకు వేచి చూస్తే.. ఇది అతిపెద్ద సవాలుగా మారుతుంది. ఈ మార్పును పెద్దవాళ్లు ఎలాగూ తీసుకురావడం లేదు. ఇక దీన్ని మనకు మనంగా పరిష్కరించుకోవాలి. ఆర్కిటిక్ మహా సముద్రం కరిగిపోతోంది. సమయం మించిపోతోంది. నాకు 30 ఏళ్లు వచ్చేసరికి ఇది కనిపించదు. అందుకే.. మన నాయకులు ఇప్పటికిప్పుడే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొంది. రోస్.. ఇప్పటికే ‘యూత్ ఫర్ స్ట్రైక్’ పేరుతో చాలా నిరసనలు చేపట్టింది. బర్డ్‌గర్ల్‌గా ఆన్‌లైన్‌లో చాలా ఫేమస్ అయిన ఈ అమ్మాయి.. ఆర్కిటిక్‌ను సేవ్ చేయడానికి ట్విట్టర్ వేదికను కూడా ఉపయోగించుకుంటోంది.
భవిష్యత్తులో కార్బన్ డై ఆక్సైడ్ వినియోగం విపరీతంగా పెరుగుతుందని, దానివల్ల 2050 లోపుగానే ఆర్కిటిక్‌లో మంచు పూర్తిగి కనుమరుగవుతుందని శాస్త్రవేత్తల బృందం ఇటీవల వెల్లడించింది. ఒకవేళ ఇప్పటినుంచి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల వినియోగం తగ్గించి, గ్లోబల్ టెంపరేచర్‌ను 2డిగ్రీల కంటే తక్కువగా ఉంచగలిగితే పరిస్థితి కొంత మెరుగు పడుతుందని వారు చెప్పారు. వాతావరణ డేటా ప్రకారం.. పర్యావరణ వ్యవస్థలో అతి వేగంగా మార్పులు ఎదుర్కొంటున్న ప్రాంతంగా ‘ఆర్కిటిక్’ ముందు వరసలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే.. పోలార్ బేర్స్, సీల్స్, ప్లాంక్టన్, అల్గే.. అన్నీ కూడా ప్రమాదంలో పడతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.