Xiaomi ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.. అక్కడ ఫస్ట్ లాంచ్..!

by Harish |   ( Updated:2023-07-05 06:38:11.0  )
Xiaomi ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.. అక్కడ ఫస్ట్ లాంచ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: Xiaomi కంపెనీ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ మోడల్ పేరు ‘Xiaomi Mix Fold 3’. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను ఆగస్టు నెలలో చైనాలో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ గతంలో వచ్చిన మిక్స్ ఫోల్డ్ 2కి అప్‌డేట్ వెర్షన్‌గా వచ్చింది. ముందస్తు నివేదికల ప్రకారం, ఈ ఫోన్ 6.5-అంగుళాల ఔటర్ ప్యానెల్, 8.02-అంగుళాల పూర్తి-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) ఇంటర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. రెండు డిస్‌ప్లేలు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. ఫోన్ ఆక్టా-కోర్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా పనిచేస్తుంది. ఫో‌న్‌లో 108MP+48MP+13MP రియర్ కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. Android v13 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రన్ అవుతుంది. దీనిలో 16GB RAM, 1TB మెమరీని అందించారు. Mix Fold 3 120W వైర్డు ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

Read More..

Meta Threads : ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్ లాంచ్..!

Advertisement

Next Story

Most Viewed