400 మిలియన్ల డివైజ్‌లలో Windows 11 ఓఎస్ వాడకం

by Harish |   ( Updated:2023-10-18 13:32:39.0  )
400 మిలియన్ల డివైజ్‌లలో Windows 11 ఓఎస్ వాడకం
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి 2021లో విడుదలైన ఆపరేటింగ్ సిస్టం Windows 11 కీలక మైలురాయిని చేరుకుంది. ఎక్కువ సంఖ్యలో డివైజ్‌లలో ఈ OS ను వాడుతున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం 400 మిలియన్ల కంటే ఎక్కువ డివైజ్‌లలో ఈ OS ను వినియోగిస్తున్నట్లు నివేదిక తెలిపింది. అయితే ఇది 2024 నాటికి 500 మిలియన్ డివైజ్‌లకు చేరే అవకాశం ఉందని కూడా నివేదిక అంచనా వేసింది. విండోస్ 10 మాదిరిగానే 11 ఆపరేటింగ్ సిస్టం వేగంగా విస్తరిస్తుంది. విండోస్ 11 విడుదలైన రెండు సంవత్సరాల్లో 400 మిలియన్ల డివైజ్‌లకు చేరుకుంది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఇటీవల కాలంలో కొత్త అప్‌డేట్‌లను అందుకుంది. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే AI పర్సనల్ అసిస్టెంట్‌ను కూడా OS కు యాడ్ చేశారు. తదుపరి విండోస్ 12 ఆపరేటింగ్ సిస్టం 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

Next Story