- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
EVMs be Hacked: ఈవీఎంలు హ్యాక్ అవుతాయా..? వెలుగులోకి షాకింగ్ విషయాలు..
దిశ వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్దాయి. ఈ నేపథ్యంలో ఏపీలో 164 స్థాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో కూటమి అఖండ విజయం సాధించింది. కాగా గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది.
దీనితో ఎవరో మోసం చేశారని అనవచ్చు కాని ఆధారాలు లేవు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. అలానే పార్టీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్‌లో వాస్తవమెంత..? అసలు ఈవీఎంలు హ్యాక్ అవుతాయా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈవీఎంలో మనం ఓటు వేసినప్పుడు ఆ ఓటు ఈవీఎంలోని కంట్రోలర్ అనే పార్ట్ సెవ్ చేసుకుని, రిజల్ట్‌ను చూపిస్తుంది. అయితే ఈ కంట్రోలర్ ఎటువంటి వైర్ లేదా వైర్లెస్ డివైస్‌కి కనెక్ట్ కాదు. అలానే దీనిలో ఎలాంటి ఆపరేటివ్ సిస్టమ్ ఉండడు. ఇది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఇక ఇందులో సర్‌క్యూట్ బేస్ చిప్‌ను ఉపయోగిస్తారు. ఒక సారి ఈ చిప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తరువాత మళ్లీ రీప్రోగ్రామ్ చేయడం కుదరదు. అంటే టెక్నికల్‌గా ఈవీఎంలను హ్యాక్ చేయలేము.
ఈవీఎంలను మార్చడం ద్వారా ఓటు ట్యాంపరింగ్‌లో వాస్తవమెంత..
ఈవీయంను మ్యానుఫ్యాక్చర్ చేసిన తరువాత చెక్ చేసి లాకర్ రూమ్‌లో పెడతారు. కాగా ఎలక్షన్ టైంలో ఈవీంలను ర్యాండమ్‌గా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకి పంపిస్తారు. అక్కడ నుండి నియోజవర్గాలకు పంపుతారు. అక్కడ ఎన్నికల అధికారి ఈవీఎంలు కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా.. ఏ పార్టీ గుర్తుకు ఓటు వేస్తే అదే పార్టీకి ఓటు పడుతుందా లేదా అని 50 ఓట్లు మార్క ఓటింగ్ చేస్తారు.
మార్క్ ఓటింగ్ అనంతరం మొత్తం సిబ్బంది సమక్షంలో చెక్ చేసి, సైన్ చేసి పోలింగ్ బూత్‌కు పంపుతారు. కాగా ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వచ్చిన ఓటరు దగ్గర నుండి ఓటరు స్లిప్‌ను, అలానే ఓటరు వేలిముద్ర, సంతకం తీసుకున్న తరువాతనే ఓటు వేసేందుకు ఓటరుకి అనుమతి ఇస్తారు. ఇక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తారు.
అనంతరం ఎన్నికల ఫలితాల లెక్కింపు రోజు పార్టీల అభ్యర్థులు, పార్టీ ఏజెంట్‌ల సమక్షంలో కౌంటింగ్ అధికారులు ఈవీఎంలను ఓపన్ చేస్తారు. అనంతరం క్లోసర్ బటన్ కొట్టగానే ఎన్ని ఓట్లు నమోదయ్యయో చూపిస్తుంది. ప్రిసైడింగ్ అధికారి17సీ రిపోర్ట్ ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ వీఎంలో నమోదైన ఓట్లు, 17సీ రిపోర్ట్‌లో ఉన్న ఓట్లతో మ్యాచ్ కావాలి, అంటే ఈవీఎంలో 1000 ఓట్లు నమోదైనట్టు ఉందనుకోండి 17సీ రిపోర్ట్ లో కూడా 1000 ఓట్లు ఎండాలి, అప్పుడే కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. లేకపోతే రీపోలింగ్ పెడతారు. కాగా 17సీ రిపోర్ట్‌లో ఎంతమంది ఓటు వేశారు, అలానే ఓటరుకి సంబంధించిన సమాచారం ఉంటుంది.