WhatsAppలో డేట్ ఆధారంగా మెసేజ్‌లను చూడొచ్చు

by Harish |   ( Updated:2023-11-07 10:17:17.0  )
WhatsAppలో డేట్ ఆధారంగా మెసేజ్‌లను చూడొచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ త్వరలో రానుంది. చాట్‌లో పాత మెసేజ్‌లను చూడటానికి తేదీ ఆధారంగా చూసే సదుపాయాన్ని కంపెనీ టెస్టింగ్ చేస్తుంది. ప్రస్తుతం చాట్‌లో పాత మెసేజ్‌లను చూడటానికి స్క్రోల్ చేస్తూ ప్రతి మెసేజ్‌ను చూడాల్సి వస్తుంది. ఒక్క వ్యక్తితో చేసే చాట్ అయితే ఈజీగానే ఉంటుంది, అదే గ్రూపులల్లో చాలా మంది ఉంటారు. మెసేజ్‌లు కూడా ఎక్కువగా ఉంటాయి. అన్ని మెసేజ్‌లలో మనకు కావాల్సిన దాన్ని కనుక్కోవడం చాలా కష్టం.

తేదీ వారీగా మెసేజ్‌లను చూసే ఆప్షన్ ఇవ్వడం ద్వారా కావాల్సిన మెసేజ్‌లను ఈజీగా చూడవచ్చు. సెర్చ్ బార్‌లో డేట్‌తో కూడిన క్యాలెండర్ కనిపిస్తుంది. అందులో మీకు కావాల్సిన మెసేజ్ తాలూకు డేట్, నెల, సంవత్సరాన్ని ఎంచుకోవాలి. తరువాత ఆ రోజుకు సంబంధించిన మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు కనిపిస్తాయి. దీంతో టైం వేస్ట్ కాదు. ప్రస్తుతం ఈ ఫీచర్ వెబ్‌వెర్షన్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగతా వారికి కూడా వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed