కొత్త ఆవిష్క‌ర‌ణ‌: వండ‌ట‌మే కాదు, రుచి కూడా చూసే రోబోట్‌! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-12-16 15:10:09.0  )
కొత్త ఆవిష్క‌ర‌ణ‌: వండ‌ట‌మే కాదు, రుచి కూడా చూసే రోబోట్‌! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కాలంతో పాటు మ‌నుషుల ఆలోచ‌న‌లు, అవ‌స‌రాలు మారుతున్నాయి. త‌ద్వారా, మిషీన్ల స‌హాయం అత్యంత ఆవ‌శ్య‌క‌మ‌య్యింది కూడా. అందుకే, ఈ యంత్రాలు మునుపెన్నడూ లేనంత వేగంగా విషయాలు నేర్చుకుంటున్నాయి. అంతేకాదు, మ‌నిషి స్థానాన్ని వేగవంతంగా భర్తీ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా అభివృద్ధి చేసిన రోబోట్ వంట వండ‌ట‌మే కాదు ఆహారాన్ని రుచి కూడా చూడగలిగేలా రూపొందించారు. అంటే, ఏదో ఉప్పు చూసి వ‌దిలేయ‌డం కాదు. ఇది మ‌నిషి ఆహారాన్ని నమిలే వివిధ దశల్లో ఆ ఆహారం రుచి ఎలా ఉంటుంద‌ని కూడా గుర్తించే సామర్థ్య‌మున్న‌ రోబోట్. ఈ రోబో చెఫ్‌ను రష్యన్ గణిత శాస్త్రజ్ఞుడు, కంప్యూటర్ శాస్త్రవేత్త మార్క్ ఒలీనిక్ తయారుచేయ‌గా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు రోబోట్‌కు ఆహారం వండేటప్పుడు 'రుచి' చూడ‌గ‌లిగేలా శిక్షణ ఇచ్చారు. ఇప్ప‌టికే ఈ రోబో ఎగ్‌ ఆమ్లెట్లు వండడానికి శిక్షణ పొందింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఫ్రంటీర్స్‌ రోబోటిక్స్ & AI జర్నల్‌లో దీనికి సంబంధించి వివ‌ర‌ణాత్మ‌క‌మైన ప‌రిశోధ‌నా ప‌త్రాన్ని ప్రచురించారు.

Advertisement

Next Story

Most Viewed