లేటెస్ట్ ఫీచర్స్‌తో వచ్చిన ‘నథింగ్ ఇయర్ 2’ ఇయర్‌ఫోన్‌లు

by Harish |   ( Updated:2023-03-23 08:53:52.0  )
లేటెస్ట్ ఫీచర్స్‌తో వచ్చిన ‘నథింగ్ ఇయర్ 2’ ఇయర్‌ఫోన్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: నథింగ్ కంపెనీ నుంచి కొత్తగా ఇయర్‌ఫోన్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. దీని పేరు ‘నథింగ్ ఇయర్ 2’. మార్చి 28న మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి Flipkart, Myntra, వివిధ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 9,999. గతంలో వచ్చిన నథింగ్ ఇయర్ 1 కంటే ఇది లేటెస్ట్ అప్‌డేట్ వెర్షన్‌తో వచ్చింది.


నథింగ్ ఇయర్ 2 ఇయర్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో వస్తున్నాయి. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో Android, iOS డివైజ్‌లకు సులభంగా కనెక్ట్ అవుతుంది. టచ్ కంట్రోల్ సిస్టం ద్వారా మ్యూజిక్, కాల్స్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇది డ్యూయల్-ఛాంబర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రతి ఇయర్‌పీస్ మూడు AI-బ్యాక్డ్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. ఇది 40dB వరకు బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌ను వినిపించకుండా చేస్తుంది.


దుమ్ము, నీటి నిరోధకత కోసం IP55గా రేట్ చేయబడింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ డివైజ్‌‌లతో త్వరగా కనెక్ట్ కావడానికి Google ఫాస్ట్ పెయిర్‌‌ను, అలాగే, Windows 10 కంప్యూటర్‌లతో త్వరగా కనెక్ట్ కావడానికి స్విఫ్ట్ పెయిర్ ఫీచర్‌ సపోర్ట్ కలిగి ఉంది. ప్రతి ఇయర్‌పీస్‌లో 33mAh బ్యాటరీ, చార్జింగ్ కేస్‌లో 485 mAh బ్యాటరీని అమర్చారు. ఇది ఒకే చార్జ్‌పై 36 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

Read more:

మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చిన WhatsApp

Advertisement

Next Story

Most Viewed