- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టెక్స్ట్ ఇవ్వగానే వీడియో రూపొందించే కొత్త AI టూల్.. ఈ ఏడాదిలోనే స్టార్ట్
దిశ, టెక్నాలజీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన OpenAI నుంచి Sora AI అనే టూల్ ఈ ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఇది టెక్స్ట్-టు-వీడియో జనరేషన్ టూల్. దీని ద్వారా యూజర్లు టెక్స్ట్‌ను టైప్ చేయగానే దానికి అనుగుణంగా 60 సెకన్లు కలిగిన వీడియోను రూపొందించి అందిస్తుంది. ఇప్పటికే దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. సోషల్ మీడియా వినియోగదారులకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వీడియో జనరేషన్‌లో ఇది సరికొత్త సంచలనానికి తెరలేపిందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతానికి Sora AI ఫీచర్‌ను డిజైనర్లు, చిత్రనిర్మాతలు వంటి ఎంపిక చేసిన నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉందని OpenAI చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, మీరా మురాటి ప్రముఖ మీడియాతో అన్నారు. సాధారణ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఈ ఏడాదిలో దీనిని ప్రజలకు విడుదల చేసే అవకాశం ఉందని మీరా తెలిపారు. వీడియో కంటెంట్ క్రియేటర్లకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది, భద్రత పరంగా పబ్లిక్‌లో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి వీడియోలను రూపొందించదని, ముందుజాగ్రత్త చర్యగా అన్ని అవుట్‌పుట్‌లను వాటర్‌మార్క్ చేస్తుందని మీరా పేర్కొన్నారు. భవిష్యత్తులో, OpenAI సోరాలో ఆడియో ద్వారా వీడియోను రూపొందించే ఫీచర్‌ను సైతం ఇవ్వనున్నారు.