టెక్నో కంపెనీ నుంచి Neo 3 స్మార్ట్‌ఫోన్

by Harish |
టెక్నో కంపెనీ నుంచి Neo 3 స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నో కంపెనీ నుంచి కొత్తగా ‘Tecno Pova Neo 3’ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది. ఇటీవల ట్విట్టర్‌లో వచ్చిన ఒక పోస్ట్ ప్రకారం. ఈ ఫోన్ గతంలో వచ్చిన Tecno Pova Neo 2కి కొనసాగింపుగా కొత్త ఫీచర్లతో దేశీయ వినియోగదారులను ఆకట్టుకోడానికి రాబోతుంది. అంచనాల ప్రకారం ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. MediaTek Helio G85 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. HiOS 8.0 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12తో రన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

స్మార్ట్‌ఫోన్ వెనుక 16-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. దీనిలో 18W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని అందించారు. ఆగస్టు మొదటి వారంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు దీని ధర రూ.12 వేల నుంచి రూ. 14 వేల మధ్య ఉండవచ్చు.

Advertisement

Next Story