Thirupati: తుఫాన్ ఎఫెక్ట్.. తలకోన జలపాతం వద్ద ఆంక్షలు

by Ramesh Goud |
Thirupati: తుఫాన్ ఎఫెక్ట్.. తలకోన జలపాతం వద్ద ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: ఫెంగల్ తుఫాన్(Fengal Cyclone) ఎఫెక్ట్ తిరుపతి జిల్లా(Tirupati District) పర్యాటకులపై పడుతోంది. బంగాళఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ఈదురుగాలులు, భారీ వర్షాలతో బీభత్సం సృష్టిస్తోంది. దీంతో తుఫాన్ ప్రభావ రాష్ట్రాల్లో పలు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం(Erravaripalem) మండలంలోని తలకోన జలపాతం(Talakona Waterfall) వద్ద కూడా అధికారులు ఆంక్షలు(Restrictions) విధించారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో తలకోన జలపాతానికి నీటి ప్రవాహం పెద్ద ఎత్తున పెరగడంతో జలపాతం ఉప్పొంగుతోంది.

దీంతో జలపాతం వద్ద వారం పాటు ఆంక్షలు విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జలపాతాన్ని వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధించినట్లు తెలిపారు. కాగా ఫెంగల్ తుఫాన్ కారణంగా తమిళనాడు(Tamil Nadu)లోని కరైకాల్- మహాబలిపురం (Karaikal-Mahabalipuram) వద్ద తీరం దాటింది. దీంతో తమిళనాడు సహా ఎపీలోని నెల్లూరు, చిత్తూరు. వైఎస్ఆర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Advertisement

Next Story