మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ఆ ఆసుపత్రిలోనే..

by Sumithra |
మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ఆ ఆసుపత్రిలోనే..
X

దిశ, ఏటూరునాగారం : ఆదివారం రోజు ఉదయం 6 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పక గ్రామ పోలుకొమ్మ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరిగి ఏడుగురు మావోయిస్టు మృత్యువాత పడిన విషయం తెలిసినదే. అయితే ఆదివారం మధ్యాహ్న సమయంలో ఘటన స్థలంలో మొదలైన పంచనామ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ప్రాంతం వరకు కొనసాగింది. ఘటన స్థలం నుండి మావోయిస్టు మృతదేహాలను రాత్రి 9:30 గంటల సమయానికి ఏటూరు నాగారానికి తరలించారు.

ముందుగా మావోయిస్టు మృతదేహాలను ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి భద్రపరచాలనుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో ఫ్రీజర్ బాక్స్ లో అందుబాటులో లేకపోవడంతో ములుగుకి తరలించిన మృతదేహాలను మధ్యలో గల తాడువాయి గ్రామం నుండే వెనుకకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో ములుగు ఆస్పత్రి నుండి ఫ్రీజర్ బాక్స్ లను ఏటూరు నాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి మృతదేహాలను రాత్రి 12:30 సమయంలో మార్చురీలో భద్రపరిచారు. కాగా మావోయిస్టుల మృతదేహాలకు సోమవారం ఉదయం 8:30 నుండి 9 గంటల సమయంలో ఏటూరు నాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ( పోస్టుమార్టం సెక్షన్)లో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed