- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఫోన్, మ్యాక్‌బుక్‌లలో ఏఐ ఫీచర్లు
దిశ, టెక్నాలజీ: ఈ ఏడాది ఆఖరులోగా ఐఫోన్, మ్యాక్‌బుక్‌లలో ఏఐ ఫీచర్లను తీసుకురానున్నట్టు టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) వంటి టెక్నాలజీపై కావాల్సినంత సమయం, శ్రమను వెచ్చిస్తోందని ఆయన తెలిపారు. 'భవిష్యత్తును మార్చగలిగే ఏఐతో పాటు ఇతర సాంకేతికతపై పెట్టుబడులను కొనసాగిస్తాం. అందులో ఏఐ కూడా ఒకటి. 2024 ముగిసేలోగా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని' టిమ్ కుక్ పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని దిగ్గజ సంస్థలు తమ పరికరాల్లో ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చాయి. శాంసంగ్ సహా ఇతర మొబైల్ కంపెనీలు కొత్తగా లాంచ్ చేసిన తమ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ఫీచర్లను అందించాయి. గూగుల్ పిక్సెల్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌లు ఏఐ ఆధారిత టూల్స్, యాప్‌లతో మార్కెట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యాపిల్ నుంచి ప్రకటన వెలువడం గమనార్హం. ఈ సంవత్సరం యాపిల్ విడుదల చేయబోయే ఐఫోన్ 16 సిరీస్‌లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. కంపెనీ చరిత్రలోనే ఐఓఎస్ 18 అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌గా నిలవనుందని బ్లూమ్‌బర్గ్ అభిప్రాయపడింది.