Sony ఆడియో డేస్ సేల్: Speakers, HeadPhones, SoundBars లపై తగ్గింపు ధరలు

by Harish |   ( Updated:2022-11-30 13:36:28.0  )
Sony ఆడియో డేస్ సేల్: Speakers, HeadPhones, SoundBars లపై తగ్గింపు ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ సంస్థ సోనీ అమ్మకాలను పెంచుకోడానికి తన ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందిస్తుంది. కొత్తగా వినియోగదారుల కోసం 'ఆడియో డేస్ సేల్‌' ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా తన ఆడియో డివైజ్‌లను తక్కువ ధరకు అందిస్తుంది.

ఇయర్‌ఫోన్‌ల నుంచి మొదలుకుని పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు, నెక్‌బ్యాండ్‌లు, సౌండ్‌బార్‌లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ సేల్ నవంబర్ 29న ప్రారంభమై డిసెంబర్ 4 న ముగుస్తుంది. సోనీ కంపెనీ స్టోర్‌లు, అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కావాల్సిన ప్రోడక్ట్స్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Sony WI-C310 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1999 కి లభిస్తాయి. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 15 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.


Sony WI-XB400 Extra Bass వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల ధర Amazonలో రూ. 2,799. ఇది కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తో గంట పాటు ప్లేబ్యాక్ టైంను అందిస్తుంది. ఇంకా Google అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది.


Sony SRS-XG300 X-సిరీస్ వైర్‌లెస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ అమెజాన్‌లో రూ. 24,990కు అందుబాటులో ఉంది. ఇది ఒకే చార్జ్‌పై 25 గంటల వరకు పనిచేస్తుంది. కేవలం 10 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 70 నిమిషాల ప్లేబ్యాక్ టైం అందిస్తుంది.

ఇవి కూడా చదవండి : రూ. 7,800 ధరలో లాంచ్ అయిన Vivo Y02



Advertisement

Next Story