భారత్‌లో AI ఆధారిత ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన శామ్‌సంగ్

by Harish |   ( Updated:2024-03-23 11:27:39.0  )
భారత్‌లో AI ఆధారిత ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన శామ్‌సంగ్
X

దిశ, టెక్నాలజీ: దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్ ఇండియాలో కొత్త మోడల్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Galaxy Book 4’. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో వచ్చింది. ఇంటెల్ కోర్ 5 ప్రాసెసర్, 8GB RAM ధర రూ.70,990, అదే ప్రాసెసర్‌తో 16GB RAM వేరియంట్ ధర రూ. 75,990. ఇంటెల్ కోర్ 7 వేరియంట్ 16GB RAM ధర రూ.85,990. అన్ని వేరియంట్‌లు గ్రే, సిల్వర్ కలర్స్‌లలో లభిస్తాయి. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్, ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 5000 వరకు తగ్గింపు ఉంది. విద్యార్థులకు అదనంగా 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

శామ్‌సంగ్ Galaxy Book 4 ఫీచర్స్: ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల పూర్తి-HD (1,920 x 1,080 పిక్సెల్‌లు) LED యాంటీ-గ్లేర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. విండోస్ 11 హోమ్‌తో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంది. పాత ఫొటోలను తిరిగి క్రియేట్ చేయడానికి, తక్కువ నాణ్యత కలిగిన వాటిని మంచి క్లారిటీతో తిరిగి పునరుద్ధరించడానికి AI- మద్దతు గల ఫోటో రీమాస్టర్, వీడియో ఎడిటర్ ఫీచర్లను అందించారు. మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు. టైప్-సి పోర్ట్ ద్వారా 45W చార్జింగ్‌ సపోర్ట్‌తో 54Wh బ్యాటరీని కూడా ఇచ్చారు. వెబ్‌క్యామ్ కెమెరా సరిపోక పోయినట్లయితే శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను ఉపయోగించుకోవచ్చు. భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ రీడర్ ఉంది. ల్యాప్‌టాప్ బరువు 1.55kg.

Advertisement

Next Story