Redmi A4 : రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ .. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇవే..

by Maddikunta Saikiran |
Redmi A4 : రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ .. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ, షావోమీ(Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మీ(Redmi) కొత్త మొబైల్(New Mobile)ను లాంచ్ చేసింది. ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 సదస్సు(IMC 2023 Event)లో ఈ ఫోన్‌ను ప్రదర్శించింది. రెడ్‌మీ ఏ4(Redmi A4) పేరుతో ఈ కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్ ధర రూ. 10 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బ్లాక్‌, వైట్ కలర్‌లో ఈ ఫోన్‌ లభిస్తుంది. అయితే రెడ్‌మీ ఏ4 ఫస్ట్ సేల్‌ ఎప్పటి నుంచి స్టార్ట్ అనే విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు అధికారంగా ప్రకటించలేదు.

రెడ్‌మీ ఏ4 స్పెసిఫికేషన్స్ ..

  • 6.25 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాన్‌ 4ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
  • 90 HZ రిఫ్రెష్‌ రేట్
  • ఈ ఫోన్‌లో 3.5 mm ఆడియో జాక్‌ ఉంటుంది.
  • బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సల్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
  • 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000 MAH బ్యాటరీని అందించారు.
Advertisement

Next Story

Most Viewed