Redmi నుంచి అదిరిపోయే సరికొత్త స్మార్ట్ ఫోన్

by Harish |
Redmi నుంచి అదిరిపోయే సరికొత్త స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Redmi కంపెనీ నుంచి కొత్తగా స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ మోడల్ పేరు ‘Redmi 12C’. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM+64GB స్టోరేజ్‌ ధర రూ. 8,999. 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.10,999. మ్యాట్ బ్లాక్, మింట్ గ్రీన్, రాయల్ బ్లూ, లావెండర్ పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 6 నుండి మధ్యాహ్నం 12 గంటలకు Flipkart, Amazon, Mi.com, Mi Home, ఇతర స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో వివిధ బ్యాంకు కార్డులపై తగ్గింపులు కూడా ఉన్నాయి.


Redmi 12C స్పెసిఫికేషన్స్

* 1,600×720 పిక్సెల్ రిజల్యూషన్‌‌తో 6.71-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే.

* 60Hz రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్‌ డిస్‌ప్లే,

* MediaTek Helio G85 SoC ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌‌తో రన్ అవుతుంది.


* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* సెల్ఫీల కోసం ముందు 5MP కెమెరా ఉంది.

* 10W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ బ్యాక్ సైడ్ అమర్చారు.



Advertisement

Next Story