Realme Buds: AI ఫీచర్లతో అదిరిపోయే బడ్స్.. 10 నిమిషాల చార్జింగ్‌తో 5 గంటలు..

by Harish |
Realme Buds: AI ఫీచర్లతో అదిరిపోయే బడ్స్.. 10 నిమిషాల చార్జింగ్‌తో 5 గంటలు..
X

దిశ, టెక్నాలజీ: Realme కంపెనీ ఇండియాలో కొత్తగా ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ‘Buds T310’. ఇవి నిజమైన వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లు. 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లు, AI-బ్యాక్డ్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్ట్‌తో వచ్చాయి. ఇయర్ బడ్స్ గరిష్టంగా 46dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు 360-డిగ్రీల సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇవి ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ డివైజ్ కనెక్టింగ్ ఆప్షన్‌తో వచ్చాయి. ఒక్కచార్జింగ్‌తో చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల వరకు వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. అదే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆన్‌లో ఉంటే, 26 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. కేవలం 10 నిమిషాల చార్జ్‌తో 5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి.

స్మార్ట్ టచ్ కంట్రోలింగ్, 45ms అల్ట్రా-తక్కువ లేటెన్సీ మోడ్‌‌ను కలిగి ఉన్నాయి. ఇవి డైనమిక్ సౌండ్ ఎఫెక్ట్‌లకు అనుకూలంగా ఉంటాయి. ఇండియాలో ఈ ఇయర్‌బడ్స్ ధర రూ.2,499. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా ఆగస్టు 5న మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది . వినియోగదారులు కొనుగోలు సమయంలో తక్షణం రూ. 300 తగ్గింపును పొందవచ్చు. ఇవి ఎజైల్ వైట్, మోనెట్ పర్పుల్, వైబ్రంట్ బ్లాక్ కలర్స్‌లలో లభిస్తుంది. ధుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP55 రేటింగ్ కలిగి ఉంది

Advertisement

Next Story

Most Viewed