- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేవలం 28 నిమిషాల్లో ఫుల్ చార్జ్..100W చార్జింగ్‌తో OnePlus కొత్త మోడల్
దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ OnePlus ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘OnePlus Nord 4’. ఇది 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. కేవలం 28 నిమిషాల్లో బ్యాటరీ 1 నుండి 100 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఈ మోడల్ గత ఏడాది వచ్చిన Nord 3కి సక్సెసర్‌గా లాంచ్ అయింది. గేమింగ్ కోసం దీనిలో ప్రత్యేక ఫీచర్లను అందించారు. దీని బేస్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.29,999. 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.32,999. 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.35,999. ఇది మెర్క్యురియల్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, అబ్సిడియన్ మిడ్‌నైట్ కలర్స్‌లలో లభిస్తుంది. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లకు జులై 20 నుండి జులై 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సాధారణ కొనుగోలుకు లభిస్తుంది.
OnePlus Nord 4 స్పెసిఫికేషన్లు
* 6.74-అంగుళాల 1.5K (1,240x2,772 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే.
* Android 14లో ఆక్సిజన్ OS 14.1తో రన్ అవుతుంది.
* ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 SoC ద్వారా పనిచేస్తుంది.
* బ్యాక్ సైడ్ 50MP సోనీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది.
* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.
* 4K వీడియోను, 60fps వద్ద 1080p వీడియోను రికార్డ్ చేయగలదు.
* 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని అందించారు.