వాయిస్ ద్వారా ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకునే కొత్త ఫీచర్

by Harish |   ( Updated:2023-04-13 05:10:19.0  )
వాయిస్ ద్వారా ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకునే కొత్త ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: iPhone వినియోగదారులకు Truecaller లేటెస్ట్ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కొత్తగా లైవ్ కాలర్ ఐడీ (Live Caller ID) ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో తెలియని నంబర్ నుండి ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు ‘Hey Siri’ ట్రూకాలర్‌ సెర్చ్ అనగానే, వాయిస్‌తో Truecaller యాక్టివేట్ అయి నంబర్‌ను త్వరగా క్యాప్చర్ చేస్తుంది. తర్వాత వారి వివరాలు కనుక్కొని స్క్రీన్ పైన చూపిస్తుంది. అయితే, ఈ కొత్త ఫీచర్ iOS 16, కొత్త డివైజ్‌లలో Truecaller ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఎవరు కాల్ చేస్తున్నారో వాయిస్ ఓవర్ ద్వారా చెప్పడం వలన నెంబర్‌ను ప్రత్యేకంగా ఎంటర్ చేసి సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. పైగా నంబర్‌కు సంబంధించిన మొత్తం వివరాలు క్షణాల్లో డిస్‌ప్లే పైన కనిపిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed