8 వేలలోపే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Disha Web Desk 8 |
8 వేలలోపే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలా మంది కీ ప్యాడ్ ఫోన్స్ కూడా వాడుతున్నారు. ఎక్కువ డబ్బు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే స్తోమత లేక కొనుగోలు చేయడం లేదు. అయితే అలాంటి వారికి తీపికబురు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మార్చి 27న ప్రారంభమైన స్మార్ట్ ఫోన్ సేల్స్‌లో భాగంగా కంపెనీ వినియోగదారులకు ఈ ఫోన్ అందించనుంది. ఇక ఈ ఫోన్ అసలు ధర రూ. 8,499కాగా, ప్రారంభ ఆఫర్ కింద ఇప్పుడు మార్కెట్‌లో రూ. 7999 లభిస్తుంది. అమెజాన్, లావా అధికారిక వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న ఇండియన్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే..

8GB RAM, ఎక్సెటెన్షన్ ద్వారా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

బ్యాటరీ సామర్థ్యం 5000 MAH, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

ఫోన్‌కు ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 500 గంటల స్టాండ్ బై టైంను, 38 గంటల టాక్ టైంను అందిస్తోంది.

ఈ ఫోన్ మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములు

6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను లావా ఓ2లో అందించారు.

ఈ మొబైల్ పిక్సెల్ డెన్సిటీ 269 పీపీఐ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.

కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌ కాగా, దీంతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా చూడవచ్చు.

వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ అలాగే ఫ్లాష్ కోసం స్క్రీన్ ఫ్లాష్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది.


Next Story