- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ బ్యాటరీతో మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్.. ధర కూడా తక్కువే!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ Itel కంపెనీ నుంచి బడ్జెట్ ధరలో భారత వినియోగదారులకు అనుగుణంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Itel P40’. ఇది ఎంట్రీ-లెవల్ 4G స్మార్ట్‌ఫోన్. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రూ. 7,699 ధరలో లభిస్తుంది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది. ఇది డ్రీమీ బ్లూ, ఫోర్స్ బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ నుంచి 12 నెలల వారంటీ, ఉచిత వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా లభిస్తుంది. భారీ బ్యాటరీతో వస్తున్న ఫోన్ ఒక్క చార్జ్‌పై గరిష్టంగా 32 గంటల కాలింగ్‌ను, 15 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Itel P40 స్పెసిఫికేషన్లు
* 6.6-అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లే, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్.
* వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
* ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)పై రన్ అవుతుంది.
* ఆక్టా-కోర్ Unisoc SC9863A SoC ద్వారా పనిచేస్తుంది.
* బేస్ వేరియంట్ 4GB RAM, 64GB స్టోరేజ్ మెమరీ ని కలిగి ఉంది.
* ఫోన్ బ్యాక్ సైడ్ 13MP కెమెరా ఉంది.
* ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉంది.
* ఫోన్ 18W ఫాస్ట్ చార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది.